Old school Easter eggs.
Teluguworld.wap.sh









విడుదల తేదీ : 21 ఆగష్టు 2015
TeluguArea.asia : 3.5/5
దర్శకుడు : సురేందర్ రెడ్డి
నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
సంగీతం : ఎస్ఎస్ తమన్
నటీనటులు : రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం…

టాలీవుడ్ మాస్ మహారాజ్ కెరీర్లో టాప్ 3 ఫిల్మ్స్ లో ఒకటిగా చెప్పుకోదగిన సినిమా ‘కిక్’. 2009లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ క్రేజీ మూవీకి చేసిన సీక్వెల్ ‘కిక్ 2′. రవితేజ కిక్ తర్వాత మరోసారి సురేందర్ రెడ్డితో కలిసి చేసిన ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. టాలీవుడ్ గోల్డెన్ లెగ్ రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఒక సూపర్ హిట్ ప్రాజెక్ట్ కి సీక్వెల్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. అలాంటి రిస్క్ చేసిన రవితేజ – సురేందర్ రెడ్డి – కళ్యాణ్ రామ్ లు ‘కిక్ 2′ సీక్వెల్ తో ఏ మేరకు అభిమానుల అంచనాలను అందుకున్నారో ఇప్పుడు చూద్దాం..

కథ :
‘కిక్ 2′ సినిమా కథ ‘కిక్’ సినిమాకి కొనసాగింపుగా మొదలవుతుంది. మొద్దటి పార్ట్ లోని కిక్ అలియాస్ కళ్యాణ్(రవితేజ) – నైన(ఇలియానా)ల కుమారుడు రాబిన్ హుడ్(రవితేజ) కథే ఇది. అక్కడ కళ్యాణ్ కి కిక్ కావాలి, ఇక్కడ మన రాబిన్ హుడ్ కి కంఫర్ట్ కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తనకి కంఫర్ట్ మిస్ అయితే పక్కనోడికి చుక్కలు చూపిస్తాడు, తనకి కంఫర్ట్ ఉన్నంత వరకూ పక్కన ఏం జరిగినా పట్టించుకోడు. ఇక కథలోకి వెళితే.. కిక్ పోలీస్ ఉద్యోగం మానేసి యుఎస్ లో సెటిల్ అవుతాడు. రాబిన్ హుడ్ అమ్మ కడుపులో కంఫర్ట్ లేదని 7 నెలలకే బయటకి వచ్చేస్తాడు. అలా భూమి మీదకి వచ్చినప్పటి నుంచి తన తండ్రిని కూడా కాదని, తన కంఫర్ట్ కోసం పక్కోడి ప్రాణాలతో పేకాడుకుంటూ పెరుగుతాడు. డాక్టర్ అయిన రాబిన్ హుడ్ ఓ హాస్పిటల్ కట్టాలనుకుంటాడు. దానికి ఇండియాలో తనకు ఉన్న ఆస్తులని అమ్మేసి డబ్బు తెచ్చుకోవాలని ఇండియాకి వస్తాడు. అలా వచ్చిన రాబిన్ హుడ్ కి చైత్ర(రకుల్ ప్రీత్ సింగ్) పరిచయం అవుతుంది. కొద్ది రోజులకే చైత్ర రాబిన్ హుడ్ ప్రేమలో పడుతుంది. కానీ రాబిన్ హుడ్ మాత్రం తనని ప్రేమించడు.

రాబిన్ హుడ్ కూడా చైత్రని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకునే టైంలో చైత్రని కొందరు కిడ్నాప్ చేస్తారు. కట్ చేస్తే మన హీరో రాబిన్ హుడ్ చైత్రని వెతుక్కుంటూ బీహార్ లోని విలాస్ పూర్ గ్రామానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కథలోకి ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న రౌడీ సోలమాన్ సింగ్ ఠాకూర్(రవి కిషన్), అతని కొడుకు మున్న(కబీర్ సింగ్) కథలోకి ఎంటర్ అవుతారు. మన చైత్ర చుట్టూ జరిగిన కొన్ని సంఘటనల వలన విలన్స్ ఇద్దరూ మన రాబిన్ హుడ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మన హీరో కంఫర్ట్ మిస్ అవ్వుద్ది. అక్కడి నుంచి కథలో వరుస మలుపులతో, హీరో – విలన్స్ మధ్య ఛాలెంజింగ్ సీక్వెన్స్ లు మొదలవుతాయి. అసలు చైత్రని కిడ్నాప్ చేసింది ఎవరు.? అసలు రాబిన్ హుడ్ లైఫ్ లో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి.? అవి తన కంఫర్ట్ ని ఎలా డిస్టర్బ్ చేసాయి.? రాబిన్ హుడ్ సోలమాన్ సింగ్ ఠాకూర్, అతని కొడుకు ఠాకూర్ ని ఎలా ఎదుర్కున్నాడు.? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :
‘కిక్’ సినిమాలో అందరినీ థ్రిల్ చేసింది రవితేజ పాత్రని తీర్చిదిద్దిన విధానం. ఆ సినిమా సీక్వెల్ అంటే దానికి మించి రవితేజ పాత్ర ఉండాలి. అలాంటి పాత్రని రాయడంలో రైటర్ వక్కంతం వంశీ సక్సెస్ అయితే, ఆ పాత్రని చూపించడంలో సురేందర్ రెడ్డి కూడా డబుల్ సక్సెస్ అయ్యాడు. ‘కిక్ 2′ సినిమాకి ఫస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్ అదే. కిక్ సినిమాకి మించి సీక్వెల్ లో కథ – కథనాలు ఆశిస్తారు. అవి కూడా పర్ఫెక్ట్ గా కుదరడం ఈ సినిమాకి మరో ప్లస్. సురేందర్ రెడ్డి రాసుకున్న కథనం మరోసారి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ ని స్టార్ట్ చేసిన విధానం, రాబిన్ హుడ్ గా రవితేజని పరిచయం చేసిన విధానం, అతని పాత్రని డెవలప్ చేస్తూ వచ్చిన విధానం ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా కనెక్ట్ అయిపోవడంతో ఇక పక్క చూపులు ఉండవు. కిక్ లానే కంఫర్ట్ పాత్రని ఫస్ట్ హాఫ్ లోనే ఆడియన్స్ లోకి ఎక్కించేయడంలో సురేందర్ రెడ్డి 100% సక్సెస్ అయ్యాడు.

నటీనటుల్లో మాస్ మహారాజ్ రవితేజ రాబిన్ హుడ్ పాత్రలో అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తన ‘కంఫర్ట్’ కోసం అవతలి వాడికి చుక్కలు చూపించే సీన్స్ లో సూపర్బ్ కామెడీని పండించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన రవితేజ సెకండాఫ్ లో పవర్ఫుల్ రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ లో, చాలెంజింగ్ సీన్స్ లో అందరినీ అబ్బురపరిచేలా నటించాడు. అలాగే రవితేజ స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ చూసే ఆడియన్స్ కి కొత్త ఫీల్ ని ఇస్తుంది. సినిమా స్టార్టింగ్ లో ఒక మూడు సీన్స్ లో ఫస్ట్ పార్ట్ కిక్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో గత సినిమాలకన్నా బాగా అందంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో, పాటల్లో బాగా మోడ్రన్ లుక్ లో కనిపించిన రకుల్ ప్రీత్ బిహార్ అమ్మాయి గెటప్ లో అయితే అదుర్స్.. పెర్ఫార్మన్స్ పరంగా కూడా మంచి పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకి చాలా బాగా న్యాయం చేసింది. రవితేజ – రకుల్ ప్రీత్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, లిప్ లాక్ స్పెషల్ అట్రాక్షన్. కామెడీ కింగ్ బ్రహ్మానందం పండిట్ రవితేజ గా ఫస్ట్ హాఫ్ లో బాగా నవ్వించాడు. ఎప్పటిలానే రవితేజ – బ్రహ్మానందం కాంబినేషన్ సీన్స్ బాగా పేలాయి.

విలన్ గా కనిపించిన రవికిషన్ లుక్ ఎంత గంభీరంగా ఉందో, అంతే గంభీరమైన నటనని కనబరిచారు. రవితేజ చేసిన కంఫర్ట్ లాంటి పాత్రకి స్ట్రాంగ్ పోటీనిచ్చే పాత్రలో రవికిషన్ జీవించాడు. రవితేజ – రవికిషన్ – కబీర్ సింగ్ ల మధ్య వచ్చే చాలెంజింగ్ ఎపిసోడ్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఊపిరి బిగబట్టుకొని సీటు చివరన కూర్చొని ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. బాలీవుడ్ కమెడియన్స్ అయిన రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రాలు పరవాలేదనిపించారు. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, కోవై సరళ లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఐటెం సాంగ్ లో నోర ఫతేహి అందాల అరబోతతో ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకుంది. ఇక సినిమాలో మిమ్మల్ని కట్టి పడేసే అంశాలకు వస్తే.. సినిమా స్టార్టింగ్ చాలా అంటే చాలా బాగా, ఆసక్తిగా ఉంటుంది, అదే జోష్ లో క్రేజీ లవ్ స్టొరీ మొదలవ్వడం, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ తో ఆడియన్స్ ని నవ్విస్తూనే కథలోకి తీసుకెళ్ళారు. ఇక సెకండాఫ్ లో మాస్ ని మెప్పించే చాలెంజింగ్ ఎపిసోడ్స్, యాక్షన్ బ్లాక్స్ మరియు అందరూ థ్రిల్ అయ్యే ఒకటి రెండు ట్విస్ట్ లు బాగానే పేలాయి. కిక్ 2 కి హైలైట్ బ్లాక్స్ – రవితేజని మిస్టర్ కంఫర్ట్ గా చూపించిన తీరు, బిహార్ ఎపిసోడ్ లో విలనిజం,టెంపుల్ బ్యాక్ డ్రాప్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్, రవితేజ – రవి కిషన్ మధ్య వచ్చే ఛాలెంజ్ బ్లాక్స్.

మైనస్ పాయింట్స్ :
‘కిక్ 2′ సినిమాలో చెప్పుకోదగిన ఒకటి రెండు మైనస్ పాయింట్స్ ఉన్నాయి.. మొదటగా చెప్పుకోవాల్సింది సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ బాగా తక్కువ అవ్వడం. అలాగే సెకండాఫ్ మొదలైన 25 నిమిషాలు చాలా చాలా స్లోగా సాగడం. ఆ ఎపిసోడ్ చాలా బోరింగ్, దాన్ని ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. కిక్ సినిమాలో సీరియస్ తో పాటు కామెడీ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. కానీ కిక్ 2 లో ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయినంతగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్. దానివల్ల సెకండాఫ్ లో అక్కడక్కడా సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది. ఇక చెప్పుకోదగినది అంటే సినిమా రన్ టైం. కిక్ 2 సినిమాని 161 నిమిషాల పాటు కాకుండా ఇంకాస్త కుదించి 140 నిమిషాల్లో చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.

ఈ రన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లో అక్కడక్కడా సినిమాని సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. వీటితో పాటు సెకండాఫ్ లో చాలా సేపు హీరో పాత్రని చాలా సైలెంట్ గా ఉంచేయడం, ఆ సమయంలో మరే ఆసక్తికర సీన్స్ జరగకపోవడం మరో మైనస్. సురేందర్ రెడ్డి కథనం ఇంకాస్త తఫ్ గా రాసుకోవాల్సింది, ఎందుకంటే అన్ని ట్విస్ట్ లు సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఆరడుగుల పైన ఉన్న కబీర్ సింగ్ పాత్రని సరిగా రాసుకోలేదు. అతన్ని సరిగా ఉపయోగించుకోలేదు.

సాంకేతిక విభాగం :
‘కిక్ 2′ సినిమాలో మనకు బాగా కొత్తగా అనిపించేది కథ కోసం ఎంచుకున్న బిహార్ లోని విలాస్ పూర్ బ్యాక్ డ్రాప్. ఈ బిహార్ బ్యాక్ డ్రాప్ ని, అక్కడి కల్చర్ ని, అక్కడి లొకేషన్స్ ని సినిమాకి సరిపోయేలా పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఈ విషయంలో మార్కులు కొట్టేసింది సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. ఆయన ప్రతి లొకేషన్ ని ఇంకా చూడాలి అనేంతలా చూపించాడు. ఇక నటీనటుల్ని ప్రజంట్ చేసిన విధానం సూపర్బ్. ఇక ఎస్ఎస్ తమన్ ఇచ్చిన పాటలు బాగున్నాయి, పిక్చరైజేషన్ పరంగా ఇంకా ఇంకా బాగున్నాయి. పాటలను పక్కన పెడితే చాలా స్పెషల్ కేర్ తీసుకొని చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. మనోజ్ పరమహంస – తమన్ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. గౌతమ్ రాజు ఎడిటింగ్ జస్ట్ ఓకే, కానీ ఇంకాస్త కట్ చేసి షార్ట్ చెయ్యడానికి ట్రై చేసుంటే బాగుండేది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా, ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉన్నాయి. నారాయణ రెడ్డి ఆర్ట్ వర్క్ బాగుంది.

వక్కంతం వంశీ కథ విషయానికి వస్తే.. వంశీ ఎప్పుడు కొన్ని ఆసక్తికర పాత్రలని క్రియేట్ చేసి ఆ తర్వాత వాటిని అల్లుకుంటూ ఓ కథని సిద్దం చేస్తాడు. కిక్ 2కి అలానే జరిగింది. కానీ కిక్ లో ఉన్నంతగా పూర్తి కొత్తదనం ఈ కథలో లేదు. కొన్నిచోట్ల రెగ్యులర్ కమర్షియల్ కథ అనే ఫీలింగ్ కలిగేలా చేసాడు. వక్కంతం వంశీ డైలాగ్స్ కూడా ఓ సూపర్ అనేలా కాకుండా జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. ఇక కథనం – దర్శకత్వం డీల్ చేసిన సురేందర్ రెడ్డి విషయానికి వస్తే.. కథనం – బాగుంది, కిక్ 2 సినిమాకి కథనమే ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ట్విస్ట్ లని సురేందర్ రెడ్డి కథనంలో రివీల్ చేసిన విధానం బాగుంది, కానీ కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఇక డైరెక్టర్ గా అటు కామెడీని, ఇటు యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా బాగా డీల్ చేసాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా తెలుగు ఆడియన్స్ కి సరికొత్త ఫీల్ ఇచ్చేలా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నందమూరి కళ్యాణ్ రామ్ తన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో మరోసారి హిట్ ఫిల్మ్ ని అందించడమే కాకుండా తన బ్యానర్ లో ప్రేక్షకులను మెప్పించే సినిమాలే వస్తాయని మరోసారి నిరూపించాడు. ఈ సినిమా ఓ రేంజ్ గ్రాండ్ లెవల్లో రావడానికి తనే ప్రధాన కారణం అని చెప్పడంలో అనుమానమే లేదు.

తీర్పు :

సూపర్ హిట్ మూవీ ‘కిక్’కి సీక్వెల్ గా వచ్చిన రవితేజ ‘కిక్ 2′ సినిమా ఓ మంచి సీక్వెల్ అని నిరూపించుకుంది. మొదటి పార్ట్ లానే కిక్ 2 కూడా మాస్ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. అదిరిపోయే కొత్తరకమైన హీరో పాత్రతో ఆసక్తికర స్టొరీ లైన్ తో వచ్చిన ఈ సినిమాలో అభిమానులకు కావాల్సిన కామెడీ మరియు యాక్షన్ పుష్కలంగా ఉండడం ‘కిక్ 2’కి పెద్ద హెల్ప్ అయ్యింది. రవితేజ పాత్ర, దానిని తీర్చిదిద్దిన విధానం, సినిమా స్టార్టింగ్, బ్రహ్మానందం కామెడీ, రకుల్ ప్రీత్ సింగ్ లవ్ ట్రాక్, కొన్ని ట్విస్ట్ లు, సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో ది బెస్ట్ అయితే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కాస్ట్ తగ్గడం, రన్ టైం కాస్త ఎక్కువవ్వడం, అక్కడక్కడా సాగదీత చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా కిక్ సినిమాని ఊహించుకొని వచ్చిన ప్రతిఒక్కరూ కిక్ 2 విషయంలో కూడా ఓ మాంచి రవితేజ మార్క్ మాస్ ఎంటర్ టైనర్ చూసాం అని ఫీలవుతారు. ఈ వారంతం థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేయదగిన సినిమా ‘కిక్ 2′.



TeluguWorld.wap.sh:-3.5/5




Users Online


2057